logo

బస్సు మరమ్మతులకు మెకానిక్‌ బృందాలు

రహదారి మధ్యలో వాహనం ఆగితే ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్టీసీ బస్సు ఆగితే ట్రాఫిక్‌ రద్దీని ఊహించలేం. అయితే ఈ ఇబ్బంది రానీయమని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌జోన్‌ అధికారులు చెబుతున్నారు.

Published : 07 Jul 2022 02:06 IST

ఆరు అత్యవసర సేవల వాహనాలు

బస్సును పర్యవేక్షిస్తున్న టీఎస్‌ఆర్టీసీ మెకానిక్‌ సిబ్బంది

ఈనాడు - హైదరాబాద్‌: రహదారి మధ్యలో వాహనం ఆగితే ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్టీసీ బస్సు ఆగితే ట్రాఫిక్‌ రద్దీని ఊహించలేం. అయితే ఈ ఇబ్బంది రానీయమని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌జోన్‌ అధికారులు చెబుతున్నారు. బస్సు ఆగకుండా అన్ని సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డిపోల నుంచి బయటకు పంపుతామని.. ఒక వేళ ఎక్కడైనా ఆగితే నిమిషాల్లో దాన్ని పక్కకు తీసి మరమ్మతులు చేస్తామని చెప్పారు. నగరవ్యాప్తంగా ఆరు బృందాలలను సిద్ధంగా ఉంచుతున్నట్టు గ్రేటర్‌జోన్‌ ఈడీ యాదగిరి చెప్పారు.

ఫోనుద్వారా సమాచారం..
నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో ఈ మొబైల్‌ వ్యాన్లుంటాయి. ఇందులో మెకానిక్‌ సిబ్బంది అత్యవసర పనిముట్లతో ఉంటారు. రేతిఫైల్‌, కోఠి కంట్రోల్‌ రూమ్‌కు ఆర్టీసీ బస్సు డ్రైవరు, కండక్టర్‌ ఫోను చేస్తే.. దగ్గర్లోని సిబ్బందిని వారు అప్రమత్తం చేసి.. వారికి ఆగిన బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ నంబరు ఇస్తారు. వెంటనే అక్కడి నుంచి మెకానిక్‌ బృందం వెళ్లి సమస్య పరిష్కరిస్తారు. లేదంటే డిపోలకు తీసుకెళ్తారు. ఈ రెండు కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు వేకువ జామునుంచి అర్థరాత్రి వరకూ పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఒక వేళ బస్సు ఆగిపోతే.. దానికి కారణమేంటో తెలుసుకుని.. విచారణ జరిపించి వారిపై చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని