కళాశాలలు.. ఏమాయె!
దౌల్తాబాద్, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిర్మిస్తామని గత ఎన్నికల ప్రచారంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రజా ప్రతినిధలు హామీలిచ్చారు. దీంతో తమ ప్రాంతంలో జూనియర్ కళాశాల నిర్మాణం అయితే ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు ఆశపడ్డారు. ఆ హామీలు నేటికి నెరవేరక పోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా సంవత్సరం ఆరంభమైనా ఈ ఏడాది కూడా కళాశాలల ఏర్పాటు కలగానే మారుతోందని వాపోతున్నారు.
ఏటా వేయి మందికి పైనే...
దౌల్తాబాద్‌లో 33, బొంరాస్‌పేటలో 43గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకు దౌల్తాబాద్‌లో 7 ఉన్నత, ఓ కస్తూర్బా పాఠశాల, బొంరాస్‌పేటలో 4 ఉన్నత, కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం కలిపి ఏటా 1000 మందికి పైగా విద్యార్థులు పది ఉత్తీర్ణులవుతున్నారు. వీరిలో బాలుర కంటే బాలికలే అధికంగా ఉంటారు. మారుమూల మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు.
ప్రస్తుతం ఒక్కటే ఒక్కటి
విద్యార్థుల సౌకర్యార్థం కొడంగల్‌లో ప్రభుత్వ కళాశాల ఉంది. మూడు మండలాల్లో కలిసి సుమారు 1700కుపైగా విద్యార్థులుంటారు. వీరికి ఒక కశాలలో సీట్లు సరిపోక తాండూరు, పరిగి, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ప్రైవేట్‌కు పంపుతున్నారు. స్థోమత లేని వారు ఇతర పనులకు పంపిస్తున్నారు. వీరిలో అధికంగా బాలికలే ఉంటున్నారు. వీరిలో ఎంతో ప్రతిభ ఉన్నా సౌకర్యాలు లేక ఆడపిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారని పలువురు విద్యావేత్తలు వాపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పలుసార్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నాయకులకు, అధికారులకు విన్నపాలు తెలిపినా సమస్య అలాగే మిగిలిపోయిందన్నారు.
2017లో నిర్మాణ పనులు ప్రారంభించినా..
2017 డిసెంబర్లో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో జూనియర్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టాలని భావించారు. అందుకోసం గెయిల్ సంస్థ సహకరించింది. అప్పటి శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి పనులను సైతం పరిశీలించి జూన్ వరకు భవనం నిర్మించి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను సైతం ఆదేశించారు. పనులను మధ్యలోనే నిలిపి వేశారు. కొడంగల్ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు గుర్నాథ్రెడ్డి సైతం ఈప్రాంత సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి స్థానికంగా ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర.. తిరుగులేని స్ఫూర్తి: సీఎం జగన్
-
Ap-top-news News
Jhanda uncha rahe hamara : ఆ గీతాన్ని రాసినందుకు జైలు శిక్ష..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
-
India News
PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ
-
Ts-top-news News
TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం