logo
Published : 07 Jul 2022 02:06 IST

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

దోమ, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో యువకుడు మోసగించడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన దోమ ఠాణా పరిధి ఊటుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. నవీన్‌(23) హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. అక్కడే మల్కాజిగిరికి చెందిన యువతి(21)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, ప్రేమగా మారింది. తనను వివాహం చేసుకోవాలని నవీన్‌ను కోరింది.  దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని ఆమెను నాలుగు రోజుల కిందట గ్రామానికి తీసుకువచ్చాడు. యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. బుధవారం తల్లిదండ్రులతోపాటు ఊటుపల్లిలోని ప్రియుడి ఇంటికి వచ్చింది. ఇరు కుటుంబాలు, పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పెళ్లి చేసుకోవాలంటే.. కట్నం ఇవ్వాలని యువకుడి తల్లిదండ్రులు డిమాండ్‌ చేయడంతో, మనస్తాపానికి గురైన ఆమె తనతో తెచ్చుకున్న బ్లేడుతో ఆ ఇంటి ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  బాధితురాలిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని