logo

స్కూటర్‌ డిక్కీ నుంచి రూ.12 లక్షల విలువైన నగల చోరీ

స్కూటర్‌ డిక్కీనుంచి రూ.12లక్షల విలువైన బంగారు గడియారాలు, వజ్రపు హారం చోరీ అయిన ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌

Published : 07 Jul 2022 02:06 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: స్కూటర్‌ డిక్కీనుంచి రూ.12లక్షల విలువైన బంగారు గడియారాలు, వజ్రపు హారం చోరీ అయిన ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు తెలిపిన వివరాలివీ.. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని పుష్ప గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ జ్యువెల్స్‌ దుకాణం నుంచి గత నెల 30న అమీర్‌పేట మెరీడియన్‌ ప్లాజాలో ఉన్న ఆదిత్య, పూజ జ్యువెలర్స్‌లకు 241 గ్రాముల 5 బంగారు చేతి గడియారాలు, 93 గ్రాముల వజ్రపు హారాన్ని పంపారు. తిరిగి ఆభరణాలు తీసుకొచ్చేందుకు ఈనెల 4న పుష్ప దుకాణం నుంచి సేల్స్‌మెన్‌ భరత్‌ దివాసిని పంపారు.  వాటిని తీసుకుని అతను తన స్కూటర్‌ సీటు కింద డిక్కీలో పెట్టుకున్నాడు. ఆబిడ్స్‌లోని మరో దుకాణంలో అందించేందుకు అక్కడికి వెళ్లి  చూస్తే డిక్కీలో సొత్తు కనిపించలేదు.  అమీర్‌పేటలో మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో దొంగలు డిక్కీలోంచి కాజేశారని గుర్తించారు. ఈ మేరకు పుష్ప గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ జ్యువెల్స్‌ దుకాణ మేనేజర్‌ నిఖిత్‌ కొఠారి పంజాగుట్ట పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదుచేసి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని