logo
Published : 07 Jul 2022 02:06 IST

ఆసుపత్రిలో నారాయణరెడ్డి హత్య కేసు నిందితులు?

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: గత నెల 27న నారాయణరెడ్డిని హత్య చేసి జిన్నారం అటవీ ప్రదేశంలో కాల్చేసిన శ్రీనివాస్‌రెడ్డి, కాశీ పోలీసులకు  దొరికి ఆస్పత్రిలో ఉన్నట్లు  సమాచారం. పోలీసులకు పట్టుబడగానే నిందితులు తమకు కడుపు నొప్పిగా ఉందని తెలపడంతో ఇద్దరినీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు కర్నూలు పారిపోయిన శ్రీనివాస్‌రెడ్డి, కాశీ పోలీసులకు దొరకకుండా తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు తొలుత మరో నిందితుడు ఆశిక్‌ను పట్టుకున్నారు. దాంతో తామూ దొరికిపోతామనే భయంతో శ్రీనివాస్‌రెడ్డి, కాశీ ఎలుకల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. దాని ప్రభావానికి కడుపునొప్పి వచ్చిందని చెప్పారు. నారాయణరెడ్డి హత్యకు అతని మామ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎన్ని రోజుల నుంచి పథకం పన్నాడో అనే విషయాలతో పాటు హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డికి గతంలో ఏమైనా నేరచరిత్ర ఉందా అనే విషయాలు త్వరలోనే తేలనున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని