logo

రూ.లక్షల్లో జీతాలని రూ.30 కోట్లతో ఉడాయింపు

ఆన్‌లైన్‌లో ఉద్యోగం, నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చని నమ్మించి డిపాజిట్‌ రూపంలో రూ.30 కోట్లకుపైగా దండుకొని బిచాణా ఎత్తేశాడని బాధితులు బుధవారం హైదరాబాద్‌ సీసీఎస్‌(డీడీ)లో ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాలకు

Published : 07 Jul 2022 02:06 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో ఉద్యోగం, నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చని నమ్మించి డిపాజిట్‌ రూపంలో రూ.30 కోట్లకుపైగా దండుకొని బిచాణా ఎత్తేశాడని బాధితులు బుధవారం హైదరాబాద్‌ సీసీఎస్‌(డీడీ)లో ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 700 మంది బాధితుల తరుఫున పి.శ్రీనివాసులు, విజయకుమార్‌, స్రవంతి, జి.శ్రీనివాసరావు, ధనలక్ష్మి మాట్లాడారు. ‘‘శతాబ్దం కాలం నాటి ప్రసిద్ధ విదేశీ(ఆంగ్ల) రచయితల లక్షల పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేయడానికి అమెరికాలో ప్రముఖ సంస్థ తమ ‘డిజినల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌’కు బాధ్యత అప్పగించింది. ఆన్‌లైన్‌లో వర్క్‌ ఇస్తామని, వాటిని స్కాన్‌ చేసి పంపితే నెలకు కనీసం రూ.3 లక్షల వరకు సంపాదించవచ్చ’ని నార్త్‌ ఇండియాకు చెందిన సంస్థ యజమాని అమిత్‌శర్మ ప్రకటనలు గుప్పించాడు. దిల్లీలో ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌లో ఉప కార్యాలయాలు ఉన్నాయని చెప్పాడు.  

పుస్తకాలు స్కాన్‌ చేయడమే.. : 10 వేల పేజీలు స్కాన్‌ చేస్తే రూ. లక్ష, 20 వేల పేజీలకు 2 లక్షలు, 30 వేల పేజీలకు 3 లక్షలు ప్రతి నెల సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించాడు. దీంతో ప్రజలు రూ.లక్ష నుంచి మొదలుకొని రూ.20 లక్షలు వరకు పెట్టుబడులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని