Secunderabad Violance: నాకేం తెలియదు.. కావాలనే ఇరికించారు: సుబ్బారావు నోట అదే మాట

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆవుల సుబ్బారావుతో

Published : 08 Jul 2022 02:26 IST

హైదరాబాద్‌: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురి కస్టడీ ముగిసింది. ఆవుల సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులను రెండు రోజులపాటు సికింద్రాబాద్‌ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో రైల్వే పోలీసులు ప్రశ్నించారు. ఘటన జరిగే ముందు రోజు సికింద్రాబాద్‌లోనే ఉండి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి సంబంధించి వ్యూహాలను రచించడం, విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారిని ఉసిగొల్పే విధంగా ప్రేరేపించడం వంటి అంశాలపై ప్రశ్నించారు. తనకు ఈకేసుతో  ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విచారణలో చెప్పినట్టు తెలిసింది. కస్టడీ ముగిసిన అనంతరం సుబ్బారావుతో పాటు మరో ముగ్గురికి సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని