logo

ప్రపంచ ఆర్థిక రంగంలో ఎంఎస్‌ఎంఈలది ముఖ్యపాత్ర

ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ(మైక్రో, స్మాల్‌, అండ్‌ మీడియా ఎంటర్‌ప్రైసెస్‌)లు మెజారిటీ వ్యాపారాలు కలిగి ఉన్నాయని, ఉద్యోగకల్పన, ప్రపంచ ఆర్థికరంగాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తున్నాయని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనీల్‌ అగర్వాల్‌

Published : 03 Aug 2022 03:13 IST

రెడ్‌హిల్స్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ(మైక్రో, స్మాల్‌, అండ్‌ మీడియా ఎంటర్‌ప్రైసెస్‌)లు మెజారిటీ వ్యాపారాలు కలిగి ఉన్నాయని, ఉద్యోగకల్పన, ప్రపంచ ఆర్థికరంగాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తున్నాయని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనీల్‌ అగర్వాల్‌ అన్నారు. మంగళవారం ‘ఎస్‌ఎంఈ ఫైనాన్సింగ్‌, అప్రోచెస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌’ అంశంపై వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(శంషాబాద్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌, అండ్‌ మీడియా ఎంటర్‌ప్రైసెస్‌(ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ)తో కలిసి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో 17 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ మంత్రిత్వశాఖల నుంచి 29 మంది అధికారులు హాజరయ్యారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మేనేజింగ్‌ కన్సల్‌టెంట్‌ మల్లికార్జున గుప్తా, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైసెస్‌(ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ) ఫ్యాకల్టీ మెంబర్‌ డా.విశ్వేశ్వరరెడ్డి, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఛైర్మన్‌ వై.వరప్రసాద్‌రెడ్డి, ఎఫ్‌టీసీసీఐ సీఈఓ ఖ్యాతి నారవాణే పాల్గొన్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని