logo
Published : 06 Aug 2022 00:45 IST

ముంపులోనే పంటలు

ఆందోళనలో అన్నదాతలు 


మోమిన్‌కుర్థు సమీపంలో పత్తి పంట

తాండూరు గ్రామీణ, నవాబుపేట, వికారాబాద్‌ గ్రామీణ, ధారూర్‌, న్యూస్‌టుడే: భారీ వర్షాలు పంట పొలాల్ని ముంచెత్తాయి. తాండూరు మండలం గ్రామాల్లో శుక్రవారం కురిసిన వర్షంతో వరద భారీగా పొలాల్లోకి చేరింది. ఉద్దండాపూర్‌, సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లితండా, జిన్‌గుర్తి, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, బెల్కటూరు, కరణ్‌కోట, అల్లాపూర్‌, సిరిగిరిపేట, మిట్టబాస్పల్లి, ఐనెల్లిలో కంది, పత్తి, పెసర, మినుము పంటలు నీట మునిగాయి. పొలాల్లో నిలిచిన నీటిని పంపే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు. పంటలు దెబ్బతినడంతో వేలాది రూపాయల పెట్టుబడులు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నవాబుపేటలో పొలాల్లో నీరు చేరి టమాట, బజ్జిమిరప ఇతర పంటలు కుళ్లిపోతున్నాయి. దీంతో విపణికి తరలించలేక పొలంలోనే వదిలేస్తున్నారు. వికారాబాద్‌ మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మండల పరిధి ద్యాచారం, మదన్‌పల్లి, అత్వెల్లి, మైలార్‌దేవరంపల్లి, రాళ్లచిట్టంపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్లు ప్రమాదకరంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ధారూర్‌ మండలంలో లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వాగుల సమీపంలోని పంటల నుంచి వరద ప్రవహించడంతో నీటికి కొట్టుకుపోయాయి. తరిగోపుల, మోమిన్‌కుర్ధు. ధారూర్‌, నాగారం తదితర గ్రామాల్లో పత్తి, పసుపు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


నవాబుపేటలో కుళ్లిపోయిన టమాట


సంకిరెడ్డిపల్లిలో..


దెబ్బతిన్న ద్యాచారం రోడ్డు

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని