logo

తూటాలతో ఆట.. కత్తులతో విన్యాసాలు

పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఎయిర్‌పిస్టర్‌ కొనుగోలు చేసిన యువకుడు బాలుడ్ని గాయపర్చిన సంఘటన తాజాగా వెలుగుచూసింది.

Published : 06 Aug 2022 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఎయిర్‌పిస్టర్‌ కొనుగోలు చేసిన యువకుడు బాలుడ్ని గాయపర్చిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. పాతబస్తీలోని చార్మినార్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్‌, బండ్లగూడ, మొగల్‌పుర, బహదూర్‌పుర తదితర ప్రాంతాల్లో తరచూ తుపాకులు, కత్తులతో యువకులు నడిరోడ్లపై హల్‌చల్‌ చేస్తుంటారు. తుపాకీపై మోజుతో ఎయిర్‌ పిస్టల్స్‌, దేశవాళీ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో పెళ్లి బరాత్‌లో తుపాకులు, తల్వార్లతో నాట్యం చేయటం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది. పెళ్లికొడుకు చేతిలో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. మరో వివాహ వేడుకలో గాల్లోకి జరిపిన కాల్పుల్లో తూటా ఓ బాలిక శరీరంలోకి దూసుకెళ్లింది. తుపాకీపై మోజుతో కొందరు ఎయిర్‌ పిస్టల్స్‌ కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో రూ.30,000-35,000 ధరకు దొరకటం, లైసెన్స్‌ అవసరం లేకపోవటంతో తేలికగా చేతికి అందుతున్నాయి. వీటి సాధనను ఇల్లు, ఫామ్‌హౌస్‌ల్లో చేయటం ప్రాణాల మీదకు తెస్తోంది. నగర శివార్లలో ఓ యువకుడు ఎయిర్‌ పిస్టల్‌తో శునకాన్ని కాల్చి చంపాడు. పటాన్‌చెరులో ఓ యువకుడు ఎయిర్‌పిస్టల్‌తో కాల్చటంతో ఓ బాలిక మృతి చెందింది. కొందరు దొంగలు, స్థిరాస్తి వ్యాపారులు, రౌడీషీటర్లు ఎయిర్‌ పిస్టల్స్‌ను చూసి బెదిరింపులకు పాల్పడున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు