logo
Published : 06 Aug 2022 01:52 IST

ప్రతి ఇంటికో జాతీయ జెండా: తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించేలా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 563 స్క్రీన్లలో ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్‌మెంట్‌ శాఖ అధికారులు, ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ స్టేట్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, కార్యదర్శులు అనుపమ్‌రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని