logo

ప్రాచీన జ్ఞానమే ఆధునిక విజ్ఞాన పురోగతికి ఆధారం

భారతీయ ప్రాచీన జ్ఞానం, శాస్త్రీయ అవగాహననే ఆధునిక విజ్ఞాన పురోగతికి ఆధారమని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌, విజ్ఞాన భారతి అధ్యక్షుడు డాక్టర్‌ శేఖర్‌ సి మాండె అన్నారు.

Published : 06 Aug 2022 01:52 IST


డాక్టర్‌ శేఖర్‌ సి మాండెకు పుస్తకాన్ని బహూకరిస్తున్న వి.ఎం.తివారీ, వినయ్‌ నందికూరి

ఈనాడు, హైదరాబాద్‌ : భారతీయ ప్రాచీన జ్ఞానం, శాస్త్రీయ అవగాహననే ఆధునిక విజ్ఞాన పురోగతికి ఆధారమని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌, విజ్ఞాన భారతి అధ్యక్షుడు డాక్టర్‌ శేఖర్‌ సి మాండె అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా విజ్ఞాన భారతి, తెలంగాణ శాఖ, నగరంలో మూడు సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలు ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐ సంయుక్తంగా శుక్రవారం ఎన్‌జీఆర్‌ఐ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి సత్యనిష్ఠ, నిస్వార్థ సేవలతో దేశాభివృద్ధికి పాటు పడాలని కోరారు. సమావేశంలో ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.ఎం.తివారీ, సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ సీహెచ్‌ మోహన్‌రావు, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని