logo

ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన రెండు ఆర్టీసీ బస్సులు

వేగంగా వెళ్తున్న కారును ఒక్కసారిగా నిలపడంతో వెనకే వస్తున్న బస్సును ఆపగా దాన్ని మరో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టాయి. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

Published : 06 Aug 2022 01:52 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: వేగంగా వెళ్తున్న కారును ఒక్కసారిగా నిలపడంతో వెనకే వస్తున్న బస్సును ఆపగా దాన్ని మరో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టాయి. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సంగీత్‌ చౌరస్తా వద్ద నుంచి మదర్‌ థెరిసా విగ్రహం ప్రాంతం మీదుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్దకు మూడు ఆర్టీసీ బస్సులు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. వీటి ముందు కారు వెళ్తుంది. ఆ కారుకు ముందు వాహనం అడ్డు రావడంతో ఒక్కసారిగా రోడ్డుమీదే ఆపారు. ఈ విషయాన్ని గుర్తించిన రాణిగంజ్‌ డిపో బస్సు డ్రైవర్‌ అంజయ్య బస్సును ఆపాడు. ఆ వెనకాలే వేగంగా వస్తున్న రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌ డిపోల బస్సులు ఒకదానినొకటి ఢీకొని ముందున్న బస్సును ఢీకొట్టింది. వీరిలో కొందరు సమీపంలోని అపోలో చికిత్స పొందగా, మరికొందరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని