logo

విగ్రహాల పంపిణీకి, నిమజ్జనాలకు ఏర్పాట్లు

వినాయక చవితి నేపథ్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ, నిమజ్జనం ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ దృష్టి సారించాయి. 8 అంగుళాల నుంచి 1.5 అడుగుల ఎత్తున్న 6.6 లక్షల....

Published : 06 Aug 2022 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: వినాయక చవితి నేపథ్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ, నిమజ్జనం ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ దృష్టి సారించాయి. 8 అంగుళాల నుంచి 1.5 అడుగుల ఎత్తున్న 6.6 లక్షల విగ్రహాల కోసం బల్దియా దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలిక పోర్టబుల్‌ నీటి ట్యాంకుల ఏర్పాటుకూ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యం పెరుగుతోందని ఎన్జీవోలు గతంలో హైకోర్టును ఆశ్రయించడంతో స్పందించిన న్యాయస్థానం చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పండగకు 3 వారాలే ఉండటంతో మట్టి విగ్రహాల పంపిణీతోపాటు తాత్కాలిక కొలనుల ఏర్పాట్లపై అధికారులు నిమగ్నమయ్యారు. హుస్సేన్‌సాగర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు జోన్‌కు 8 చొప్పున 50 తాత్కాలిక కొలనులను (ట్యాంకు) ఏర్పాటు చేయనున్నారు. పీవీసీ మెటీరియల్‌తో తయారు చేసే ట్యాంకు ఏర్పాటు, నిమజ్జనం తర్వాతతొలగింపు బాధ్యత ఏజెన్సీలే చూసుకుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని