logo
Published : 06 Aug 2022 02:56 IST

‘వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం’


విజేతలుగా నిలిచిన సంస్థల నిర్వాహకులతో ఒప్పో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీం ఆరిఫ్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: సామాజిక పరిష్కారాలు, ఆరోగ్య సంరక్షణలో వినూత్న ఆవిష్కరణలను తమ సంస్థ ఆర్థికంగా, సాంకేతికంగా ప్రోత్సహిస్తుందని ఒప్పో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌ అండ్‌ డీ హెడ్‌ తస్లీం ఆరిఫ్‌ పేర్కొన్నారు. సామర్థ్యం ఉన్న అంకుర సంస్థల అభివృద్ధిని వేగవంతం చేయడం, అవి విపణిలో విస్తరించడంలో సహకారం అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న రెండో విడత ‘ఒప్పో ఎలివేట్‌’ కార్యక్రమం ఫైనల్స్‌ శుక్రవారం నానక్‌రాంగూడలో నిర్వహించారు. ఫైనల్స్‌లో పది సంస్థలు పాల్గొని తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులను ప్రదర్శించాయి. వాటిలో ఉత్తమంగా నిలిచిన యోగిఫై, టింకర్‌ టెక్‌, బ్యాక్‌యార్డ్‌ క్రియేటర్స్‌, కాగ్నియేబుల్‌ సంస్థలు విజేతలుగా నిలిచాయి. విజేతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేసిన అనంతరం తస్లీం ఆరిఫ్‌ మాట్లాడుతూ.. విజేతలుగా నిలిచిన సంస్థలు ఈ ఏడాది చివర్లో ప్రపంచస్థాయిలో నిర్వహించే ఆఖరిఘట్టంలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తాయని అన్నారు. అక్కడ గెలుపొందే సంస్థలకు 46 వేల డాలర్ల పెట్టుబడి సహాయం అందుతుందని తెలిపారు. ఇక్కడి అంకురాలు విజయవంతం అయ్యేందుకు తాము మార్గనిర్దేశం చేయడమేకాక, వాటి ఆవిష్కరణలు ప్రజల చెంతకు చేరేలా కృషి చేస్తామని అన్నారు. విజేతలుగా నిలిచే సంస్థలేగాక మిగతా ఆరు కూడా ఒప్పోతో కలిసి పనిచేసే అర్హత కలిగి ఉంటాయన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని