logo
Published : 06 Aug 2022 02:56 IST

సైబర్‌ సురక్ష

డిజిటల్‌ లోకంలో మంచీ చెడుపై విద్యార్థులకు అవగాహన


అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల గుట్టు తెలుసుకుంటే వాటి ముప్పును సులభంగా ఎదుర్కోవచ్ఛు కరోనా తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. వీరిలో 60శాతం మంది ఒకవైపు పాఠాలు వింటూనే మరోవైపు పలు రకాల ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడారు. అనంతరం వారిలో 20శాతం మంది సైబర్‌ నేరస్థుల బారిన పడ్డారు. బడులు ప్రారంభమైనా విద్యార్థులు ఆన్‌లైన్‌గేమ్‌ల వ్యసనాన్ని వీడట్లేదు సరికదా... పదో తరగతిలోనే కొందరు పలు సామాజిక మాధ్యమాల ఖాతాలూ ప్రారంభించారు.. దీంతో భవిష్యత్తులో నేరస్థుల బారిన పడడంతోపాటు, వీరు సైతం నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయంటూ సైబర్‌ నిపుణులు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో ‘సైబర్‌ సురక్ష’ పేరుతో పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పోలీసులు సైబర్‌నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. సైబర్‌ లిటరసీ, ఈ-మెయిళ్లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు నిర్వహించేప్పుడు జరిగే పరిణామాలను గుర్తించగలిగే సామర్థ్యాన్ని వారికి వివరించారు. విద్యార్థులు సైబర్‌నేరాల బారినపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తుండాలని సూచించారు.

పాప్‌అప్‌లు.. బయటకు రాకుండా బంధనాలు

విద్యార్థులను సైబర్‌ నేరస్థులు ఎలా ఆకట్టుకుంటున్నారు? ఏవిధంగా ప్రలోభపెడుతున్నారు? ఆశ్లీలంవైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? అనే అంశాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ గేమ్స్‌లోకి సంక్షిప్త సందేశాలు, ఇతర క్రీడలకు సంబంధించిన పాప్‌అప్‌లు, ప్రకటనలను సైబర్‌ నేరస్థులు జొప్పిస్తున్నారు. కొందరు విద్యార్థులు తమ ఆటకు అంతరాయం కలుగుతుందని వాటిని తొలగిస్తుండగా.. చాలామంది అశ్లీల వీడియోలు, పిక్టోగ్రామ్‌లు చూస్తున్నారు. ఇంతేకాదు.. కొన్ని పాప్‌అప్‌లు, పిక్టోగ్రామ్‌లు క్లిక్‌ చేస్తే.. వాటిల్లో ఉన్న వీడియోలను పూర్తిగా చూసేంతవరకూ బయటకురాకుండా సైబర్‌ నేరస్థులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారని పోలీస్‌ అధికారులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని