logo

టిక్కెట్‌కు బారులు.. ఎంఎంటీఎస్‌ పరుగులు

ఎంఎంటీఎస్‌ రైలు సేవలు రోజురోజుకీ నీరు గారుతున్నాయి. అరగంటకోసారి వచ్చే రైలును అందుకోవడం ప్రయాణికులకు కష్టంగా మారింది. టిక్కెట్‌ కోసం బారులుదీరి నిల్చుంటే కౌంటర్‌ దగ్గరకు....

Published : 06 Aug 2022 02:56 IST


హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్లో టిక్కెట్ల కోసం బారులుదీరిన ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రైలు సేవలు రోజురోజుకీ నీరు గారుతున్నాయి. అరగంటకోసారి వచ్చే రైలును అందుకోవడం ప్రయాణికులకు కష్టంగా మారింది. టిక్కెట్‌ కోసం బారులుదీరి నిల్చుంటే కౌంటర్‌ దగ్గరకు రాకుండానే ఎక్కాల్సిన రైలు తుర్రుమంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో రెండు కౌంటర్లు పని చేస్తున్నా.. ఆదివారం వచ్చేసరికి ఒక్కటే ఉంటోంది.

యూటీఎస్‌ లేకుంటే.. స్మార్ట్‌ ఫోనులో యూటీఎస్‌(అన్‌ రిజర్వుడు టిక్కెట్‌ స్కీమ్‌) యాప్‌, ఆ వ్యాలెట్‌లో డబ్బులుంటే ఎంఎంటీఎస్‌ ప్రయాణం సులువవుతోంది. ఈ యాప్‌ ఉన్నా స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలోనే టిక్కెట్‌ తీసుకోగలం. కొన్ని స్టేషన్ల వద్ద నెట్‌వర్కు సమస్య తలెత్తుతోంది. స్మార్ట్‌ఫోన్‌ లేని సామాన్యులు టిక్కెట్ల కోసం బారులుదీరాల్సి వస్తోంది. యూటీఎస్‌ వచ్చాక సీజనల్‌ టిక్కెట్‌ కూడా కౌంటర్లలో ఇవ్వడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని