logo

చిత్ర వార్తలు

చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

Published : 06 Aug 2022 02:56 IST

చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు


రైలు బండి కాదండి.. కూలీల జీవనమిదండి!

ఈ చిత్రం చూస్తుంటే మహానగరంలో పచ్చని చెట్ల మధ్య దూసుకు పోతున్న మెట్రో రైలులా కనిపిస్తోంది కదూ. వాస్తవానికి ఇవి బంజారాహిల్స్‌లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుల తాత్కాలిక నివాసాలు. రేకులతో వరుసగా ఏర్పాటు చేయడంతో ఇలా రైలు బండిని తలపిస్తున్నాయి.


తాడెత్తి వెళ్తూ.. ఠారెత్తిస్తూ!

పైచిత్రాల్లో కనిపిస్తున్నది అయిదు రోడ్లు కలిసే కీలకమైన టీహబ్‌ కూడలి. ఇంకా ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయలేదు. వాహనాల క్రమబద్ధీకరణ కోసం తాళ్లు కట్టారు. వాహనదారులు ఆ తాళ్లు ఎత్తి వెళుతుండడం వల్ల ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.


ఇళ్లలోకి వెళ్లాలంటే వణుకు

లాలాపేటలోని లక్ష్మీ నగర్‌ కాలనీలో మూడు నెలలుగా నాలా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇళ్ల ముందు తవ్వి ఇలా ప్రమాదకరంగా వదిలేశారు. ఇళ్లలోకి వెళ్లేటప్పుడు ఏమాత్రం తూలినా నాలాలో పడటం ఖాయం. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో.. ఇళ్లలోకి భద్రంగా ఎప్పుడు వెళ్తామోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

-న్యూస్‌టుడే, లాలాపేట

 


నిధుల తర్పణం.. నిర్లక్ష్యానికి దర్పణం

చెరువులో నిర్మించిన వైకుంఠధామమిది. ఏడాదిలో ఆరు నెలలు నీటిలోనే ఉంటుంది. నగర శివారు మొయినాబాద్‌ మండలం యెన్కెపల్లిలో శ్మశాన వాటిక తటాకంలో నిర్మించడంతో ఈ దుస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని