logo

పేద విద్యార్థులూ.. ప్రయోగాలు చేసేలా..

పిల్లల్లో సైన్స్‌ ప్రయోగాలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. మేడ్చల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మినీ సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Published : 06 Aug 2022 02:56 IST


శిక్షణ పొందుతున్న విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: పిల్లల్లో సైన్స్‌ ప్రయోగాలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. మేడ్చల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మినీ సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రయోగాల నిర్వహణకు ప్రత్యేక కిట్లు అందించేందుకు సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ ముందుకొచ్చింది. జిల్లాలో వంద పాఠశాలల్లో పంపిణీకి నిర్ణయించారు. 90 చోట్ల ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా స్కూల్‌లో ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అనువుగా కిట్లు ఉంటాయి. విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించనున్నారు.


మెరుగైన సదుపాయాలకు కృషి

ఐ.విజయకుమారి, డీఈవో, మేడ్చల్‌

కిట్ల వినియోగంపై తొలుత హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చి, వారితో టీచర్లకు తర్ఫీదు ఇప్పిస్తాం. ఈ ఏడాది కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయనున్నాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని