logo

పట్టుదలతో చదివి.. పసిడి సాధించి

ఓయూ ఆచార్యులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, గవర్నర్‌ తమిళిసై. అంతర చిత్రంలో సీజేఐ ఎన్వీ రమణకు ఓ కార్టూనిస్టు బహూకరించిన క్యారికేచర్‌.....

Published : 06 Aug 2022 02:56 IST

31 మందిలో నలుగురు మినహా అందరూ అతివలే

ఘనంగా ఓయూ స్నాతకోత్సవం

 

ఓయూ ఆచార్యులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, గవర్నర్‌ తమిళిసై. అంతర చిత్రంలో సీజేఐ ఎన్వీ రమణకు ఓ కార్టూనిస్టు బహూకరించిన క్యారికేచర్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయ 82వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పీహెచ్‌డీ పట్టాలతోపాటు వివిధ విభాగాల్లో పీజీ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. మొత్తం 55 బంగారు పతకాలను 31 మంది విద్యార్థులు అందుకున్నారు. వారిలో నలుగురు మాత్రమే అబ్బాయిలున్నారు. 27 మంది అమ్మాయిలు ఉన్నారు. పతకాలు అందుకున్న కొందరు అమ్మాయిలు తమ అనుభవాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.


శాస్త్రవేత్త అవుతాను

వి.తేజస్వి 4 బంగారు పతకాలు(ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)

సైఫాబాద్‌ పీజీ కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సహాంతో 4 బంగారు పతకాలు సాధించా. ప్రజలకు ఉపయోపడే పరిశోధన చేస్తాను. కొవిడ్‌ కాలంలో పూర్తిస్థాయిలో కళాశాలకు వెళ్లలేకపోయినా ఆన్‌లైన్‌ తరగతులు ఎంతగానో ఉపయోగపడ్డాయి.


సమయం వృథా చేయలేదు

కె.శ్రీనందిని, 3 బంగారు పతకాలు(ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)

కొవిడ్‌తో పూర్తిస్థాయిలో తరగతులకు హాజరు కాలేదు. సమయం వృథా చేయకుండా ఆన్‌లైన్‌లో సిలబస్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాను.


ఇష్టంతో కష్టపడి

బి.ఆశాగుప్తా, ఒక బంగారు పతకం(గణితం)

రెండు సంవత్సరాలు ఇష్టంతో కష్టపడి గణితంలో బంగారు పతకం సాధించాను. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలో ఉద్యోగం చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా.


అమ్మకు అంకితం

సరోజ, 2 బంగారు పతకాలు(స్టాటిస్టిక్స్‌)

తండ్రి లేకపోయినా తల్లి ప్రోత్సహంతోనే రెండు బంగారు పతకాలు సాధించాను. ఈ రెండు పతకాలు అమ్మకు పడిన కష్టానికి అంకితం. అధ్యాపకుల బోధనతోపాటు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సొంతంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. దీంతో పతకాలు సాధన సులభమైంది.


భర్త ప్రోత్సాహంతోనే

రీచా, రెండు బంగారు పతకాలు(సంస్కృతం)

మాది. బిహార్‌. 2004లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ప్రోత్సాహంతో ఓయూలో 2018లో సంస్కృతంలో పీజీలో చేరా. పీహెచ్‌డీ చేద్దామనుకుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని