logo

సీఎస్‌ఐఆర్‌ డీజీగా తొలిసారి మహిళ

సీఐఎస్‌ఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. కారైకూడిలోని సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్‌ రీసెర్చ్‌..

Published : 07 Aug 2022 02:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీఐఎస్‌ఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. కారైకూడిలోని సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ ఎన్‌ కాలైసెల్వి.. సీఎస్‌ఐఆర్‌ డీజీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె అదనంగా కేంద్ర సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ శాఖ కార్యదర్శిగానూ కొనసాగుతారు. ఈ మేరకు కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమె నియామకానికి ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ డీజీ బాధ్యతల్లో కొనసాగిన డాక్టర్‌ శేఖర్‌ సి మండే ఇటీవల పదవీ విరమణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని