logo

ఖైదీలకు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష

ఖైదీలు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అనుమతిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి జైల్లోని ముగ్గురు ఖైదీలు ఎమ్మెస్సీ చేసి, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారు.

Published : 07 Aug 2022 02:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖైదీలు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అనుమతిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి జైల్లోని ముగ్గురు ఖైదీలు ఎమ్మెస్సీ చేసి, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారు. ఇందుకు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వీరిలో మానసిక పరివర్తనకు కృషి చేస్తున్న వర్సిటీ ఆచార్యురాలు సి.బీనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వర్సిటీ ఉన్నతాధికారులను కోరారు. కంప్యూటర్‌ ఆధారితం కావడంతో జైల్లో ఏర్పాటు చేయలేమని, జైళ్ల శాఖ కోరితే.. ఏదైనా కేంద్రంలో ప్రత్యేక గది కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని