logo

దంపతుల మధ్య మనస్పర్థలు.. భర్త ఆత్మహత్య

దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థలతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్‌నగర్‌లోని భరత్‌నగర్‌కు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ రాహుల్‌కుమార్‌ బేగంపేట బాలంరాయికి చెందిన....

Published : 07 Aug 2022 02:05 IST

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థలతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్‌నగర్‌లోని భరత్‌నగర్‌కు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ రాహుల్‌కుమార్‌ బేగంపేట బాలంరాయికి చెందిన శాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రాహుల్‌ మధ్యప్రదేశ్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో షాలిని గతనెల 15న బేగంపేట మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు రాహుల్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఫోన్‌ చేసినా నంబరు పనిచేయకపోవడంతో ఆయన పనిచేసే సంస్థలోని సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో రాహుల్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని