logo

చిత్ర వార్తలు

చార్మినార్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 5 నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఉచిత ప్రవేశానికి తోడు శనివారం కావడంతో ఆరు వేలకు పైగానే సందర్శకులు వచ్చారు.

Published : 07 Aug 2022 02:05 IST

చరిత దర్శనం.. ఉచిత సందర్శనం

చార్మినార్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 5 నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఉచిత ప్రవేశానికి తోడు శనివారం కావడంతో ఆరు వేలకు పైగానే సందర్శకులు వచ్చారు.

-న్యూస్‌టుడే, చార్మినార్‌


మనిషికో బండి.. వీధిలో ఖాళీ ఏదండి

ప్రతి వ్యక్తికీ ఓ వాహనం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో అప్పో సప్పో తెచ్చి బండి కొనుక్కున్నా దాన్ని నిలిపి ఉంచటానికి మహానగరంలో చోటు దొరకడం గగనమైపోతోంది. అందరూ ఇలా ఇంటి ముందు నిలిపి ఉంచటం వల్ల గల్లీలు అడుగు కూడా పెట్టలేని విధంగా మారిపోతున్నాయి. ఫిలింనగర్‌లోని ఓ వీధిలో కనిపించిన దృశ్యమిది.


దర్జాగా కునుకు.. ఠాణా అన్నా మాకేం వణుకు

శునకాలు చక్కగా కునుకు తీస్తోంది ఓ పోలీస్‌స్టేషన్‌లో.. అలాగని ఇవేమీ శిక్షణ పొందిన జాగిలాలూ కాదు.. వీటిని పోలీసు సిబ్బంది పోషించడమూ లేదు. నగరంలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఇప్పుడు ఠాణాల్లోనూ తిష్ఠ వేస్తున్నాయి. వెస్ట్‌ జోన్‌ పరిధి నల్లకుంట పోలీస్‌స్టేషన్లో రాత్రి వేళ నిద్రించాయిలా..


డబీర్‌పురలోని బీబీకాఆలంను శనివారం వైతెపా అధ్యక్షురాలు షర్మిల సందర్శించారు. ఆమెకు ముస్లిం పెద్దలు దట్టీ కట్టారు.


బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జయశంకర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ, చిత్రంలో కార్పొరేటర్లు కవితారెడ్డి, సంగీత యాదవ్‌, వెంకటేష్‌ తెరాస నేతలు.

- న్యూస్‌టుడే, బంజారాహిల్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని