logo

అభినయం.. నయన మనోహరం

అమెరికాలో స్థిరపడి, నాట్యగురువైన తల్లి వద్దే కూచిపూడి నాట్యం అభ్యసించి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో సోలో ప్రదర్శన ఇచ్చి మెప్పించారు సిధ్య అరెకపూడి.

Published : 07 Aug 2022 02:05 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: అమెరికాలో స్థిరపడి, నాట్యగురువైన తల్లి వద్దే కూచిపూడి నాట్యం అభ్యసించి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో సోలో ప్రదర్శన ఇచ్చి మెప్పించారు సిధ్య అరెకపూడి. మైత్రి నాట్యాలయ (స్కూల్‌ ఆఫ్‌ భరతనాట్యం, కూచిపూడి) సమర్పణలో నాట్యగురువు షిర్నీ కాంత్‌ పర్యవేక్షణలో శనివారం రాత్రి ఆమె వైవిధ్య భరితమైన అంశాలను ప్రదర్శించారు. నాట్యగురువు నట్టువాంగం చేయగా చందర్‌రావు గాత్ర సహకారాన్ని అందించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ అరెకపూడి గాంధీ ఆమెకు ఆశీస్సులు అందజేశారు. టెక్సాస్‌ ఆస్టిన్‌లో ఉంటున్న సిధ్య అక్కడి గోర్జికి మిడిల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. ఏడేళ్లుగా కూచిపూడి సాధన చేస్తూ స్థానికంగా పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. సంగీతం సైతం నేర్చుకుందని, అండర్‌ 13 క్రికెట్‌ లీగ్‌లో ఆడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని