logo

15 రోజుల సంబరాలకు ప్రణాళిక

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నగరంలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ 15 రోజుల ప్రణాళిక సిద్ధం చేసింది. డివిజన్లు, కాలనీల స్థాయి వరకు ఆయా కార్యక్రమాలను....

Published : 07 Aug 2022 02:16 IST


శనివారం రాత్రి మువ్వన్నెల వెలుగుల్లో మెరిసిపోతున్న ఎల్బీనగర్‌లోని కామినేని వైద్య కళాశాల భవనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నగరంలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ 15 రోజుల ప్రణాళిక సిద్ధం చేసింది. డివిజన్లు, కాలనీల స్థాయి వరకు ఆయా కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల్లో తప్పక నిర్వహించాలని, వాటిని వీడియో తీసి డాక్యుమెంటరీ రూపొందించాలని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ శనివారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 8న హెచ్‌ఐసీసీలో వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి బల్దియా ఆధ్వర్యంలో నిత్యం వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. 9న నగరవ్యాప్తంగా 20 లక్షల జాతీయ పతాకాలను పంపిణీ చేయనున్నారు. 22న ఎల్బీస్టేడియంలో ముగింపు సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అమృతోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈ నెల 9 నుంచి 21 వరకు జిల్లాలోని అన్ని థియేటర్లలో రోజూ ఉదయం గాంధీ సినిమా ప్రదర్శిస్తారన్నారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్‌, వెంకటేశ్వర్లు, డీఆర్వోలు హరిప్రియ, సూర్యలత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని