logo

8న వజ్రోత్సవాలకు శ్రీకారం: కలెక్టర్‌

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈనెల 8 నుంచి 22 వరకు స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పాలనాధికారిణి నిఖిల అన్నారు.

Published : 07 Aug 2022 02:16 IST


మాట్లాడుతున్న నిఖిల, చిత్రంలో ఎస్పీ కోటిరెడ్డి ఇతర అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈనెల 8 నుంచి 22 వరకు స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పాలనాధికారిణి నిఖిల అన్నారు. శనివారం మద్గుల్‌చిట్టెంపల్లి జిల్లా పంచాయతీ వనరుల భవనంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డితో కలిసి వజ్రోత్స వేడుకలపై అధికారులతో సమీక్షించారు. 8న రాష్ట్ర రాజధానిలో వీటిని ప్రారంభిస్తారని జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులకు బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

● జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పండుగ మాదిరిగా వజ్రోత్సవాలను నిర్వహించాలని నిఖిల అధికారులకు ఆదేశించారు. శనివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. అనంతరం నిఖిల జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఈనెల 9న అన్ని ఇళ్లకు జాతీయ పతాకాలు పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. 10న ఉద్యానవనాల్లో 75 ఆకారంలో మొక్కలను నాటాలని, జిల్లా కేంద్రంలో 11న ఫ్రీడం రన్‌ను నిర్వహించాలన్నారు. 13న జిల్లా కేంద్రం ఎంఆర్‌పీ పెట్రోల్‌ పంపు నుంచి నల్ల మైదానం వరకు ఊరేగింపు, 14న నియోజక వర్గ కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీర్‌డీఓ కృష్ణన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు కోటాజి, లలితకుమారి, మల్లారెడ్డి, హన్మంత్‌రావు, రేణుకాదేవి, ఆర్డీవో అశోక్‌కుమార్‌, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని