logo

‘మూసీ’ కలుషితం కానీయొద్దు

ఈ ప్రాంతం నుంచి మూసీలోకి వెళ్లే నీరు కలుషితం కాకుండా చూడాలని జలవనరుల శాఖ విశ్రాంత అధికారి మహేందర్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి శనివారం

Published : 07 Aug 2022 02:22 IST


వివరాలు సేకరిస్తున్న బృందం సభ్యులు

పూడూరు, న్యూస్‌టుడే: ఈ ప్రాంతం నుంచి మూసీలోకి వెళ్లే నీరు కలుషితం కాకుండా చూడాలని జలవనరుల శాఖ విశ్రాంత అధికారి మహేందర్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి శనివారం పూడూరు, కేరవెళ్లి, దేవనోనిగూడ, మంచ్‌పల్లి, కంకల్‌ తదితర గ్రామాల్లోని వాగులు, పరిశ్రమలు, కాలువలు తదితర నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి నుంచి పారేనీరు కలుషితం కావటంతో మూసీలోకి వెళ్లి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇరిగేషన్‌ అధికారి రాజేందర్‌రెడ్డి, పూడూరు సర్పంచి నవ్యారెడ్డి, ఉప సర్పంచి రాజేందర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని