logo

రాజకీయాలకతీతంగా వినాయక ఉత్సవాలు

రాజకీయాలకతీతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 9 వరకు వినూత్నంగా జరపాలని

Published : 08 Aug 2022 02:58 IST
భగవంత్‌రావు, జస్మత్‌పటేల్‌లను సన్మానించిన ప్రతినిధులు

గోల్నాక, న్యూస్‌టుడే: రాజకీయాలకతీతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 9 వరకు వినూత్నంగా జరపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆదివారం కాచిగూడలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జైన్‌ సమాజ్‌, గుజరాతి ప్రగతి సమాజ్‌, కచ్‌కడ్‌వా పాటీదార్‌ సమాజ్‌ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు, కార్యదర్శి జస్మత్‌పటేల్‌ మాట్లాడారు. ప్రతినిధులు రితీశ్‌ జాగిర్దార్‌, ముఖేశ్‌ చౌహాన్‌, ఆర్‌కే జైన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని