logo

సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలి

సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, కామర్స్‌ ఛైర్మన్‌, విద్యావేత్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం విద్యార్థులకు సూచించారు. ఆదివారం కాచిగూడలోని వైశ్యాహాస్టల్‌ సమావేశ మందిరంలో హైదరాబాద్‌ జిల్లా

Published : 08 Aug 2022 02:58 IST

విద్యార్థినికి నగదు పురస్కారం, ప్రశంసాపత్రం, జాతీయ పతాకం అందజేస్తున్న విశ్వనాథం, దయానంద్‌. చిత్రంలో ఆర్యవైశ్య ప్రముఖులు

కాచిగూడ, న్యూస్‌టుడే: సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, కామర్స్‌ ఛైర్మన్‌, విద్యావేత్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం విద్యార్థులకు సూచించారు. ఆదివారం కాచిగూడలోని వైశ్యాహాస్టల్‌ సమావేశ మందిరంలో హైదరాబాద్‌ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మ్యాడం దయాకర్‌గుప్తా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, ఎస్సెస్సీ, ఇంటర్‌లో 90 శాతానికిపైగా మార్కులు సాధించిన 220 మంది విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు, జాతీయ పతాకాలను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌తో కలిసి ఆయన అందజేసి మాట్లాడారు. మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గుప్తా, కోశాధికారి సుధాకర్‌గుప్తా, గౌరవ సలహాదారు వేలూరి రవీంద్రనాథ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని