logo

ఆసరాకు అర్హులు లక్ష మందిపైనే!

ఆసరా పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు తీపికబురు. ఆగస్టు 15 నుంచి, 57 ఏళ్ల వయసున్న వారికి పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రకటించడంతో వేలాది మంది అర్హుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Published : 08 Aug 2022 02:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆసరా పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు తీపికబురు. ఆగస్టు 15 నుంచి, 57 ఏళ్ల వయసున్న వారికి పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రకటించడంతో వేలాది మంది అర్హుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 57 ఏళ్ల వారితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లకూ ఆమోదం లభించనుంది. సీఎం తాజా నిర్ణయంతో ఆసరా కింద హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి 59,017 మంది ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటికే వీరి దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. మండల స్థాయిలో అర్హుల వివరాల్ని తనిఖీ చేసి జిల్లా అధికారులకు పంపారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి పంపినా మంజూరు చేయలేదు. సీఎం ప్రకటనతో వాటికి మోక్షం లభించనుంది. పింఛను అర్హత వయసు కుదింపు నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపు ఎలా అన్నదానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ కేటగిరీ కింద గ్రేటర్‌ పరిధిలో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 57 ఏళ్ల వయసు కేటగిరీ కింద అర్హులు కలిపితే నగరంలో కొత్తగా లక్ష మంది పింఛన్లు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.

జిల్లాలవారీగా ఆమోదం పొందిన ఆసరా దరఖాస్తులు

హైదరాబాద్‌ 25,206

రంగారెడ్డి 13,561

మేడ్చల్‌ 20,250

(ఇవన్నీ వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు కేటగిరీ పింఛన్లు మాత్రమే).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని