logo

ఎస్సై ప్రాథమిక పరీక్ష ప్రశాంతం

ఎస్సై పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష నగరంలో ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందుల్లేకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published : 08 Aug 2022 02:58 IST

నగరంలో 83,598 మంది హాజరు


కూకట్‌పల్లిలోని ఓ కేంద్రం వద్ద బారులు తీరిన అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష నగరంలో ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందుల్లేకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా తనిఖీ చేశాకే అభ్యర్థుల్ని లోపలికి పంపారు. కొన్నిచోట్ల పరీక్షార్థులు తమ వెంట తెచ్చుకున్న నీళ్ల సీసాలు, శానిటైజర్‌ డబ్బాలను అనుమతించలేదు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరగ్గా.. 7 గంటల నుంచే కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 2.47 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. నగరం నుంచి 94 వేల మంది ఉండడం గమనార్హం. మొత్తం 94,755 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 83,598 మంది(88.22 శాతం) హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమనే నిబంధన కట్టుదిట్టంగా అమలుచేశారు. 10 గంటలు దాటగానే గేట్లు మూసేశారు. హయత్‌నగర్‌లోని ఓ కేంద్రానికి 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించలేదు. సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను కమిషనర్లు స్టీఫెన్‌ రవీంద్ర, మహేశ్‌ భగవత్‌ ఆదివారం తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తును పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని