logo

మోస్తరు వాన.. రాకపోకలకు హైరానా

నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రివరకు అనేక ప్రాంతాల్లో వాన పడింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్‌, హిమాయత్‌నగర్‌,

Updated : 08 Aug 2022 03:10 IST


ఖైరతాబాద్‌లో రహదారిపై వరద ప్రవాహం.. పక్కన స్తంభించిన ట్రాఫిక్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రివరకు అనేక ప్రాంతాల్లో వాన పడింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్‌, హిమాయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌లో మధ్యాహ్నం పూట గంటకుపైగా కురిసిన వర్షంతో లోతట్టు రహదారులపై అడుగు లోతు వరద చేరింది. ఆదివారం ఎస్సై పరీక్షకు హాజరైన అభ్యర్థులు వర్షంతో ఇబ్బంది పడ్డారు. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ పనులకు తోడు.. గుంతల రహదారులతో ఆ ప్రాంతంలో ఇరువైపులా కిలోమీటర్‌ వరకు ట్రాఫిక్‌జాం అయ్యింది. రహదారులపై ఎక్కడ చూసినా ఇసుక మేట వేయడంతో ప్రమాదకరంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని