logo

కరోనా సోకినా పీపీఈ కిట్‌తో వాదించిన న్యాయవాది

కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఓ న్యాయవాది తన కక్షిదారు తరఫున వాదించడానికి కోర్టుకు వచ్చారు. పీపీఈ కిట్‌, గ్లౌజులు వంటివి ధరించి సికింద్రాబాద్‌లోని 12వ అదనపు చీఫ్‌జడ్జి న్యాయస్థానంలో క్లైయింట్‌ పక్షాన సెక్షన్‌ 195, 340 కింద పిటిషన్లు దాఖలు చేశారు.

Published : 09 Aug 2022 02:50 IST

కోర్టుకు వస్తున్న లాయర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఓ న్యాయవాది తన కక్షిదారు తరఫున వాదించడానికి కోర్టుకు వచ్చారు. పీపీఈ కిట్‌, గ్లౌజులు వంటివి ధరించి సికింద్రాబాద్‌లోని 12వ అదనపు చీఫ్‌జడ్జి న్యాయస్థానంలో క్లైయింట్‌ పక్షాన సెక్షన్‌ 195, 340 కింద పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన కొవిడ్‌తో బాధపడుతూ..చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో .. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో జులై 27 నుంచి వాదనలు జరుగుతున్నాయి. కొవిడ్‌తో ఆయన హాజరు కాలేకపోయారు.  తన క్లైయింట్‌పై ప్రతివాద పార్టీలు న్యాయమూర్తి ముందు నిరాధారమైన అసత్య ప్రకటనలు చేసినట్లు గుర్తించి...తన వాదనలు వినిపించడానికి సోమవారం కోర్టుకి హాజరైనట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని