logo

యువకుడికి మంకీపాక్స్‌ లేదని నిర్ధారణ

మంకీపాక్స్‌ అనుమానంతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన యువకుడికి ఆ వ్యాధి లేదని నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శంకర్‌ తెలిపారు. శరీరంపై దద్దుర్లు రావడంతో కొత్తగూడెంకు చెందిన

Published : 09 Aug 2022 03:18 IST

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: మంకీపాక్స్‌ అనుమానంతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన యువకుడికి ఆ వ్యాధి లేదని నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శంకర్‌ తెలిపారు. శరీరంపై దద్దుర్లు రావడంతో కొత్తగూడెంకు చెందిన యువకుడు(19) ఈ నెల 6 నుంచి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతని నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా.. మంకీపాక్స్‌, చికెన్‌పాక్స్‌ లేదని నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. చర్మసంబంధ వ్యాధికి మందులు ఇచ్చి డిశ్ఛార్జి చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని