logo

యజమానిని హత్య చేసిన సెక్యూరిటీ గార్డు

 రెండు నెలల క్రితం సెక్యూరిటీ గార్డుగా చేరిన వ్యక్తి యజమానినే హత్య చేసిన ఘటన దుండిగల్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.

Updated : 09 Aug 2022 04:12 IST

మృతిచెందిన అరవింద్‌

దుండిగల్‌: రెండు నెలల క్రితం సెక్యూరిటీ గార్డుగా చేరిన వ్యక్తి యజమానినే హత్య చేసిన ఘటన దుండిగల్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పేట్‌బషీరాబాద్‌లో జాదవ్‌ అరవింద్‌ (31) భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆదర్శ్‌ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. అందులో సుమారు 300 మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. బహదూర్‌పల్లిలోని ఏజెన్సీ కార్యాలయంలో ఐదుగురు కాపాలాదారులు ఉంటూ.. కొంపల్లి పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో నల్గొండ పట్టణానికి చెందిన రవి(46) ఉన్నారు. తను నిత్యం విధుల నిర్వహణ విషయంలో యజమానితో గొడవ పడేవాడు. సోమవారం సాయంత్రం కార్యాలయంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. రాత్రి విధులు నిర్వహించాలని అరవింద్‌ సూచించగా.. అందుకు రవి నిరాకరించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. క్షణికావేశంలో రవి కూరగాయాలు కోసే కత్తితో యజమాని ఛాతీ, భుజం మధ్య ప్రాంతంలో పొడిచాడు. మరో సెక్యూరిటీ గార్డు కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


నకిలీ సంస్థ పేరిట బురిడీ?

ఈనాడు, హైదరాబాద్‌: కొందరు మాయగాళ్లు నకిలీ సంస్థ ముసుగులో బ్యాంకులను బురిడీ కొట్టించారు. మారు పేర్లతో క్రెడిట్‌ కార్డులు సేకరించి ఎంతో కాలంగా దర్జాగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. నిందితులు బ్యాంకులను రూ.2 కోట్లకు పైగా మోసగించారని దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. కొందరిని అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు