logo

స్టేట్‌హోం నుంచి యువతి అదృశ్యం

యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న అనాథ యువతి అదృశ్యమైంది. ఎస్సార్‌నగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నతనం నుంచి ఆశ్రయం పొందుతున్న యువతి(18) ఇక్కడి కాలేజ్‌ ఎట్‌ హోంలో ఉంటోంది

Published : 09 Aug 2022 03:31 IST

అమీర్‌పేట: యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న అనాథ యువతి అదృశ్యమైంది. ఎస్సార్‌నగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నతనం నుంచి ఆశ్రయం పొందుతున్న యువతి(18) ఇక్కడి కాలేజ్‌ ఎట్‌ హోంలో ఉంటోంది. ఆవరణలోని ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కాలేజ్‌ ఎట్‌ హోం సూపరింటెండెంట్‌ కరుణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రి నుంచి నర్సు...
ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి అదృశ్యమైన సంఘటన ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా కిషన్‌నగర్‌కు చెందిన ఓ యువతి(19) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని జోయ్‌ ఆసుపత్రిలో మూడు నెలలుగా పనిచేస్తోంది. ఈ నెల 1న షాపింగ్‌కు వెళ్లివస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.  ఆమె బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని