logo

స్వాతంత్య్ర పోరులో కాంగ్రెస్‌దే కీలక పాత్ర: టీఆర్‌ఆర్‌

దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడంలో గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తాండూరులోని ఇందిరాచౌక్‌ కూడలి నుంచి మంగళవారం ఆయన

Published : 10 Aug 2022 01:13 IST

పాదయాత్రగా వస్తున్న టీఆర్‌ఆర్‌, శోభారాణి, ఉత్తమ్‌చంద్‌ తదితరులు

తాండూరు, న్యూస్‌టుడే: దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడంలో గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తాండూరులోని ఇందిరాచౌక్‌ కూడలి నుంచి మంగళవారం ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆజాదీకా మహోత్సవ్‌ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నా పదవిని త్యాగం చేశారని చెప్పారు. కార్యక్రమంలో పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌చంద్‌, పెద్దేముల్‌, యాలాల, తాండూరు పట్టణం, తాండూరు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గోపాల్‌, బీమయ్య, ప్రభాకర్‌గౌడ్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

యాలాల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం గౌరవ యాత్రలో భాగంగా తాండూరు నుంచి ప్రారంభమై లక్ష్మీనారాయణపూర్‌ చేరుకుంది. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. చౌరస్తాలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి, యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షులు భీమ్యయ్య, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మన్నాన్‌, కమాల్‌పూర్‌, చెన్నారం సర్పంచ్‌లు బస్వరాజ్‌, సాయిలు, మండల సీనియార్‌ నాయకులు జక్కేపల్లి అమృతప్ప, రాంచెందర్‌, మల్లప్ప, మైను తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని