logo

మువ్వన్నెల కళ.. ఇలలో ఇలా

భాగ్యనగరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 6 లక్షలకుపైగా జెండాలు జీహెచ్‌ఎంసీకి చేరాయి. వాటిలో సగం జెండాలను నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు మొదటిరోజే ప్రజలకు పంపిణీ చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌ తదితరులు ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు. మేయర్‌ గద్వాల్‌

Published : 10 Aug 2022 02:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 6 లక్షలకుపైగా జెండాలు జీహెచ్‌ఎంసీకి చేరాయి. వాటిలో సగం జెండాలను నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు మొదటిరోజే ప్రజలకు పంపిణీ చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌ తదితరులు ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆమె డివిజన్లో జెండాలు పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్లు మమత, శంకరయ్య, పంకజ, శ్రీనివాస్‌రెడ్డి, రవికిరణ్‌, అశోక్‌సామ్రాట్‌, ఉప కమిషనర్లు, జెండాల పంపిణీని పర్యవేక్షించారు. బుధవారం ఎంపిక చేసిన 75 ఫ్రీడం పార్కుల్లో మొక్కలు నాటనున్నట్లు, ఖైరతాబాద్‌ జోన్లో 15 పార్కులను, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌ జోన్లలో 12 చొప్పున ఉద్యానాలను ఫ్రీడం పార్కులుగా ఎంపిక చేసి.. వాటిలో స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. నగరవ్యాప్తంగా గాంధీ చలనచిత్రాన్ని సుమారు 30 వేల మంది విద్యార్థులు థియేటర్లలో వీక్షించినట్లు అధికారులు అంచనా వేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పిల్లలతో కలిసి కాసేపు చిత్రాన్ని వీక్షించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని