logo

వ్యాక్సిన్‌లో దూకుడు

కరోనా టీకా పంపిణీలో గ్రేటర్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారికి 100శాతం టీకా ఇచ్చి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఇక్కడా అదే వేగం కనిపిస్తోంది. హైదరాబాద్‌ జిల్లాలో రెండో డోసు

Published : 10 Aug 2022 02:47 IST

18 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా టీకా పంపిణీలో గ్రేటర్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారికి 100శాతం టీకా ఇచ్చి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఇక్కడా అదే వేగం కనిపిస్తోంది. హైదరాబాద్‌ జిల్లాలో రెండో డోసు ఇప్పటికే 93 శాతం పూర్తయింది. రంగారెడ్డి, మేడ్చల్‌లో లక్ష్యంకంటే ఎక్కువ మందికి టీకా ఇవ్వడం విశేషం. ఈ వయసు వారికి బూస్టర్‌ డోసు సైతం ప్రారంభించారు. టీకాల కొరతతో బూస్టర్‌ డోసులో జాప్యం జరుగుతోందని వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లో కేవలం 10 శాతం మందికే బూస్టర్‌ ఇచ్చారు. రంగారెడ్డి 10 శాతం, మేడ్చల్‌లో 8 శాతం మించలేదు.

టీనేజీలో టీకా వేగమెలా?
టీనేజీ పిల్లల విషయంలో టీకా సరఫరా నెమ్మదిగా సాగుతోంది. తప్పనిసరి కాకపోవడంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని