logo

తహసీల్దారు సజీవ దహన ఘటన సాక్షి, బాధిత రైతు మృతి

గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో కాలి గాయపడిన రైతు బొడిగె నారాయణగౌడ్‌(73).. పాసుపుస్తకాలు అందుకోకుండానే అనారోగ్యంతో మంగళవారం

Published : 10 Aug 2022 02:45 IST

ఇప్పటికీ నారాయణగౌడ్‌కు దక్కని పాసుపుస్తకం

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో కాలి గాయపడిన రైతు బొడిగె నారాయణగౌడ్‌(73).. పాసుపుస్తకాలు అందుకోకుండానే అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. 2019 నవంబరు 4న  తహసీల్దార్‌ విజయారెడ్డిని మండలంలోని గౌరెల్లికి చెందిన సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. ఆ ఘటనలో  సురేష్‌, విజయారెడ్డిని కాపాడే క్రమంలో డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్య, పాసుపుస్తకాల కోసం వెళ్లిన రైతు నారాయణగౌడ్‌ గాయపడ్డారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. అయితే కాలిన గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా.. పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని 2020 నవంబరు 3న నారాయణగౌడ్‌.. తహసీల్దార్‌ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు చేస్తుండగా.. అప్పట్లో ప్రభుత్వం స్పందించి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ బృందం.. ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుంది.  కాలిన గాయాలతో జీవనం నెట్టుకొస్తున్న నారాయణగౌడ్‌.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకొని అనారోగ్యం బారిన పడినా.. ప్రభుత్వం న్యాయం చేయలేదని నారాయణగౌడ్‌ కుటుంబ సభ్యులు వాపోయారు. నారాయణగౌడ్‌ అంత్యక్రియలను కవాడిపల్లిలో మంగళవారం నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts