logo

లైంగిక వేధింపుల కేసులో వైద్యుడికి పదేళ్ల జైలు

చికిత్స నిమిత్తం వచ్చే యువతులు, మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వైద్యుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయిఈశ్వర్‌గౌడ్‌

Published : 10 Aug 2022 02:45 IST

రెజిమెంటల్‌బజార్‌: చికిత్స నిమిత్తం వచ్చే యువతులు, మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వైద్యుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయిఈశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ సోనా ఆర్కేడ్‌లోని భాస్కర్స్‌ చెస్ట్‌ క్లినిక్‌ను నిర్వహించే డాక్టర్‌ విజయభాస్కర్‌(55) వద్దకు ఊపిరితిత్తుల సమస్యతో  ఓ మహిళ వచ్చారు. ఆమెతో వైద్యుడు అనుచితంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. అక్టోబర్‌లో 7న తల్లితో వచ్చిన ఓ యువతిని ఒంటరిగా ఉంచి వైద్యం పేరుతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయాన్ని తల్లికి తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరితోపాటు మొదటి బాధితురాలు సైతం అక్టోబర్‌ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాక్టర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. నాంపల్లి 11వ ఏఎంఎస్‌జే కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి కె.కవిత నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని