logo

వృద్ధులకు రాయితీతో వైద్యం: టీఎస్‌ఆర్టీసీ

వజ్రోత్సవాలను పురస్కరించుకుని 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందజేస్తామని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ వెల్లడించారు. ఈనెల 15న జన్మించే పిల్లలకు ఆర్టీసీలో 12 ఏళ్లపాటు ఉచిత

Published : 10 Aug 2022 02:45 IST

బేగంబజార్, న్యూస్‌టుడే: వజ్రోత్సవాలను పురస్కరించుకుని 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందజేస్తామని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ వెల్లడించారు. ఈనెల 15న జన్మించే పిల్లలకు ఆర్టీసీలో 12 ఏళ్లపాటు ఉచిత ప్రయాణంతో పాటు వజ్రోత్సవాల సందర్భంగా మరిన్ని రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం వి.సి.సజ్జనార్‌ ఎంజీబీఎస్‌ప్రాంగణంలో ప్రయాణికులతో సౌకర్యాలపై మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  టీఎస్‌ఆర్టీసీ అధికారులు పురుషోత్తం నాయక్, మునిశేఖర్, సోలమన్, ఓ.సుధ, సరస్వతి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని