logo

అగర్వాల్‌ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్‌పై హైకోర్టు స్టే

హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి మహేష్‌ అగర్వాల్‌, ప్రణీత అగర్వాల్‌కు చెందిన చర, స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌చేసినట్లు నిర్ధరిస్తూ....

Published : 11 Aug 2022 03:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి మహేష్‌ అగర్వాల్‌, ప్రణీత అగర్వాల్‌కు చెందిన చర, స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌చేసినట్లు నిర్ధరిస్తూ ఇచ్చిన ధ్రువీకరణ ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది. బుధవారమిక్కడ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయనిర్ణేత అధికారి ఆమోదించిన ఈడీ ద్రువీకరణ ఉత్తర్వును నిలిపి వేసి, ఈడీకి నోటీసులు జారీ చేసింది. కేసును అక్టోబరు 27కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని