logo
Published : 11 Aug 2022 03:07 IST

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు కేసుల బదిలీ

పాలమూరు, మహబూబ్‌నగర్‌ న్యాయ విభాగం: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన తమ క్లయింట్లు రాఘవేంద్ర రాజు, పుష్పలత వేసిన రెండు కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేశారని న్యాయవాది సునీల్‌కుమార్‌ కాలేకర్‌ తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని న్యాయస్థానం బయట ఆయన తన క్లయింట్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాఘవేంద్ర రాజు తనను కిడ్నాప్‌ చేయటం, అతడి ఇంట్లోని హార్డ్‌ డిస్కులు, ఇతర వస్తువులు దొంగిలించారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మరో 19 మందిపై కేసు వేశారన్నారు. పుష్పలత అనే మహిళ తన భర్తను వేధించారని, కిడ్నాప్‌ చేశారని మరో కేసు వేశారని తెలిపారు. ఈ కేసుల్లో న్యాయస్థానం జారీచేసిన నోటీసులు నిందితుల చిరునామాలకు పంపించినా తీసుకోలేదని, వారు బుధవారం కోర్టుకు హాజరుకాలేదని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కేసులను మహబూబ్‌నగర్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి(ఎక్సైజ్‌) హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారని చెప్పారు. కేసుల విచారణ అక్కడే కొనసాగుతుందని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని