logo

రక్తనిధి కేంద్రంలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీ

తలసేమియా బాలుడికి హెచ్‌ఐవీ సోకిన ఘటనలో రక్తనిధి కేంద్రంలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు.

Published : 11 Aug 2022 03:08 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: తలసేమియా బాలుడికి హెచ్‌ఐవీ సోకిన ఘటనలో రక్తనిధి కేంద్రంలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. ఇటీవల కీసర ప్రాంతానికి చెందిన బాలుడి(3)కి రక్తం ఎక్కించిన తర్వాత హెచ్‌ఐవీ పాజిటివ్‌ రావడంతో అతని తండ్రి నల్లకుంట ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలునికి ఎప్పుడెప్పుడు రక్తం ఎక్కించారు.. ఎవరి నుంచి సేకరించిన రక్తం మార్పిడి చేశారు తదితర వివరాలను డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు అడిగి తెలుసుకున్నారు. రక్తమార్పిడి జరుగుతున్న తీరు, రోగులకు సమకూర్చిన వసతులు, దాతల నుంచి సేకరిస్తున్న రక్తం నిల్వ చేసే పద్ధతి.. వారి వివరాలు, రక్త పరీక్షల విధానం, వైద్య పరికరాలను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు