logo

ప్రాణం తీసిన బాలుడి భయం

కుక్క కరిచినా భయపడి తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో పరిస్థితి విషమించి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన బొల్లారంలో జరిగింది. ఆదర్శ్‌నగర్‌లో ఉండే శేఖర్‌, సుజాత దంపతుల పెద్ద కుమారుడు శశాంక్‌(8)....

Published : 11 Aug 2022 03:22 IST

కుక్క కరిచినా తల్లిదండ్రులకు చెప్పని చిన్నారి


శశాంక్‌

బొల్లారం, న్యూస్‌టుడే: కుక్క కరిచినా భయపడి తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో పరిస్థితి విషమించి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన బొల్లారంలో జరిగింది. ఆదర్శ్‌నగర్‌లో ఉండే శేఖర్‌, సుజాత దంపతుల పెద్ద కుమారుడు శశాంక్‌(8) రెండో తరగతి చదువుతున్నాడు. పది రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకొంటుండగా బాలుడిని కుక్క కరిచింది. ఈ విషయాన్ని బాలుడు భయపడి తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈనెల 6న తరగతి గదిలో బలహీనంగా కూర్చున్న శశాంక్‌ను గమనించి ఉపాధ్యాయురాలు ప్రశ్నించడంతో కుక్క కరిచిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే బాలుడికి జ్వరం తీవ్ర కావడం... వర్షం కురుస్తుండటంతో మామూలు అనారోగ్యమని ఇంట్లోనే మూడు రోజులుగా వైద్యం అందించారు. మంగళవారం రాత్రి వాంతులతో పరిస్థితి విషమించడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుక్కకాటు వల్ల మృతి చెంది ఉండొచ్చని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తునకు తల్లిదండ్రులు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని