logo

రైతుబజార్లలో అటకెక్కిన ఎరువు ప్లాంట్లు

నగరంలో 11 రైతుబజార్లున్నాయి. ఒక్కో దానికి వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తుంటాయి. ఈ లెక్కన చెత్త రోజుకు ఎంత జమ అవుతుందో చెప్పొచ్ఛు ఎర్రగడ్డ, మెహిదీపట్నం రైతుబజార్లలో రోజుకు టన్ను వరకూ చెత్త సమకూరుతుంది.

Published : 11 Aug 2022 03:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో 11 రైతుబజార్లున్నాయి. ఒక్కో దానికి వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తుంటాయి. ఈ లెక్కన చెత్త రోజుకు ఎంత జమ అవుతుందో చెప్పొచ్ఛు ఎర్రగడ్డ, మెహిదీపట్నం రైతుబజార్లలో రోజుకు టన్ను వరకూ చెత్త సమకూరుతుంది. ఈ చెత్తను ఇంధనంగా మార్చాలనే ఆలోచనతోనే మెహిదీపట్నం రైతుబజారులో సేంద్రియ ఎరువు యూనిట్‌ పెట్టారు. కూకట్‌పల్లి, ఎర్రగడ్డ మోడల్‌ రైతుబజార్లలో బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మెహదీపట్నంలో యూనిట్‌ మూతపడి మూడేళ్లవుతోంది. ఎర్రగడ్డ, కూకట్‌పల్లి రైతుబజార్లలోని క్యాంటీన్ల అవసరాలవరకే గ్యాస్‌ ఉత్పత్తి చేసి.. మిగతా చెత్తను జీహెచ్‌ఎంసీ ఎత్తుకెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ కరెంటు ఉత్పత్తికి అవకాశం లేకుండా అయ్యింది. మిగతా రైతుబజార్లలో టన్ను, అరటన్ను చెత్తను జీహెచ్‌ఎంసీ వాహనం వచ్చి ఎత్తుకెళ్లాల్సిందే. ఏ రోజు చెత్త ఆరోజు తీసుకెళ్లినా.. అప్పటి వరకూ అక్కడి పరిసరాలు కంపు కొడుతున్నాయి.

* 11 రైతుబజార్ల నుంచి రోజుకు 7 టన్నుల చెత్త

* అరటన్ను చెత్తతో క్యాంటీన్‌ నిర్వహణకు సరిపడే గ్యాస్‌ ఉత్పత్తి

* టన్ను సేంద్రియ ఎరువు ధర దాదాపు రూ.25 వేలు

* రోజుకు రూ.1.75 లక్షల ఆదాయానికి గండి

* బల్దియాపై రోజూ 7 టన్నుల చెత్తను తరలించే భారం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని