logo
Published : 11 Aug 2022 03:22 IST

పది సమావేశాలకు డుమ్మా

అదనపు కమిషనర్‌ తీరుపై స్థాయీ సంఘం ఆక్షేపణ

పలు తీర్మానాలకు ఆమోదం


సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, సభ్యులు, అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రస్తుత బల్దియా పాలకమండలి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు స్థాయీ సంఘం సమావేశమైంది. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి ఏకంగా 10 సార్లు సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆయన వ్యవహార తీరు ఏ మాత్రం నచ్చడం లేదు. పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ సంతోష్‌కుమార్‌ సైతం సమావేశానికి ఆలస్యంగా వస్తున్నారు.’’

* బుధవారం జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సహా ఇతర సభ్యులు ఆక్షేపణ ఇది. దీనిపై బల్దియా కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ను వారు వివరణ కోరగా.. సెలవులో ఉండటం వల్ల సమావేశానికి రాలేదని చెప్పారు. గతంలోనూ ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆ అధికారి నిర్లక్ష్యం మరోసారి పునరావృతమైందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ అధికారిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి పంపేందుకు తీర్మానం సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయమై మేయర్‌ విజయలక్ష్మిని ‘ఈనాడు’ వివరణ కోరగా.. కేవలం చర్చించామని, తీర్మానం చేయలేదన్నారు. మేయర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 10 తీర్మానాలు ఆమోదం పొందాయి. పౌరుల భద్రత దృష్ట్యా మురికివాడలు, కాలనీల్లో రూ.19.18 కోట్లతో 8 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని