logo
Published : 11 Aug 2022 03:56 IST

వాడవాడలా తిరంగా.. దేశభక్తి ఉప్పొంగగా

పార్కుల్లో మొక్కలు, స్వాతంత్రోద్యమ గీతాలు


దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో 75 మీటర్ల పొడవైన జెండాను ప్రదర్శిస్తున్న యువత

 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో బుధవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కనులపండువగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 20 వేల మందికి పైగా చిన్నారులు థియేటర్లలో ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించారని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. బుధవారం 2 లక్షల జాతీయ పతాకాలను పంపిణీ చేశామని పేర్కొంది. ఇప్పటి వరకు ఐదు లక్షల జెండాలను పంచామని అధికారులు తెలిపారు. బల్దియా పార్కుల విభాగం ఆరు జోన్ల పరిధిలో 75 ఫ్రీడం పార్కులను ఎంపిక చేసి, వాటిలో 75 రకాల మొక్కలు నాటింది. ప్రవేశ ద్వారాలకు, బెంచీలకు మూడు రంగుల జెండాను ప్రతిబింబించే రంగులద్దింది. మరో 10 పార్కుల్లో స్వాతంత్రోద్యమ గీతాలను వినిపించే ఏర్పాట్లు చేసింది. చాచా నెహ్రూ పార్క్‌, కేబీఆర్‌, కేఎల్‌ఎన్‌ యాదవ్‌, జేవీఆర్‌, కృష్ణకాంత్‌, ఏ.ఎస్‌.రావ్‌ నగర్‌, ఉప్పల్‌ అర్బన్‌, ఎన్‌జీఓ కాలనీ, సుందరయ్య, ఇందిరా పార్కులకు వచ్చే సందర్శకుల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ ఏర్పాట్లు చేశామని పార్కుల విభాగం అధికారులు వివరించారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌లో స్వీయచిత్రం దిగుతున్న విద్యార్థులు తదితరులు

గోల్కొండలో దేశభక్తి గీతాల ఆలాపనపై వాయిద్యకారుల రిహార్సల్స్‌

ఎంజీబీఎస్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు

జీవీకే మాల్‌లో గాంధీ సినిమాకు హాజరైన విద్యార్థులతో నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌

గోల్కొండ ప్రధాన గేటు వద్ద పోలీసుల సన్నాహాలు


బస్సుకు ఉత్సవ శోభ


త్రివర్ణ శోభితం

బంజారాహిల్స్‌ డివిజన్‌ ఎన్‌బీటీ నగర్‌లో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. జెండాల ప్రదర్శన అనంతరం పార్కులో 75 మొక్కలను ఆమె నాటారు.

- న్యూస్‌టుడే, బోరబండ

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని